Comment 1: మందసలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జన్న చెరువు నుండి పక్కనున్న చిన్న చెరువు నుండి నీరు కాపు వీధిలోనికి వస్తున్నది సుమారుగా వారం రోజులు అయింది దానివల్ల అక్కడ ఉన్న రోడ్డు కోతకి గురి అయింది ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ దారి గుండా రెండు మూడు గ్రామాలకు వెళ్లే ప్రజలు అలాగే మందస లో ఉన్న కాపు వీధిలో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. (KH: 9.11.2022)
Comments 2: మందస కొత్తవీధిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ మీద నీరు నిలబడి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా స్థానిక నాయకులు, పట్టణ పెద్దలు స్పందించి అధికారుల దృష్టిలో పెట్టాలని, అదేవిధంగా అసంపూర్తిగా నిర్మితమైయున్న మందస మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసి, రోడ్డుకి ఇరువైపులా కాలువ నిర్మాణం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా గౌరవ మంత్రిగారికి తెలియజేయాలని కోరుతున్నాము. (KH: 9.11.2022)