8.30.2022: 400 Mtrs track కి అవసరం అయిన ఆట స్థలానికి ఎటువంటి అవరోధం కలుగకుండా, ,నిరూపయోగం లో ఉన్న స్థలాన్ని కేటాయించి,అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న సంభదిత వ్యక్తులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు…👏👏👏 (SD)
8.27,2022: Happy to learn that the allocation of space for the additional buildings in the vicinity of our school playground has been resolved. I thank each and everybody who took part in this endeavor. To satisfy public, students, players, local elders as well as High School faculty & administration at the same time, obviously is a herculean task. But you did it successfully in such a short period of time. Our special thanks should go to Sambhamurty garu and Head master Bhaskararao garu of our School as well as Kishor Senapthy garu and Kanchi garu who played a critical role in resolving this issue. I understand that the Engineer will do the needful measurements of the site for buildings on Monday, next week and a surveyor will demarcate the original Playground area very soon. Thanks once again to you all for your sincere efforts in this regard. (MAP)
8.27.2022: గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.గత కొంతకాలంగా మన గ్రూప్ లో చర్చించబడుతున్న హైస్కూల్ నిధుల సద్వినియోగం, అదనపు తరగతిగదుల నిర్మాణం అంశం సరైన ఫలితాలు సాధించింది. చివరకు మందస గ్రౌండులో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ వెనుకవైపున గల ఖాళీ స్థలంలో మన హైస్కూల్ కి సంబంధించిన( అదనంగా మంజూరైన) తరగతి గదుల నిర్మాణం చేపట్టుటకు అందరూ అంగీకరించడం జరిగింది. వీలయినంత తొందరలో సంబంధిత అధికారులు వచ్చి, కొలతలు తీసుకొని నిర్మాణ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈ చర్చ విజయవంతమై, సరైన ఫలితాలు సాధించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ చర్చలు సఫలమవడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ క్రీడాకారులైన సేనాపతి కిశోర్ గార్కి, కంచి బెహరా గార్కి, పాఠశాల కమిటీ చైర్మన్ తలగాన వెంకటరావు గార్కి అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి నిరంతరము కృషిచేస్తున్న ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గార్కి, సాంబమూర్తి మాస్టర్ కు మరియు అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. (KH)
8.24.2022: As you are aware, our High School senior faculty met with our Minister garu today and discussed about the issues related to the additional space needed for the construction of new buildings. I am happy to learn that the meeting went very well in a positive direction. Let us hopefully the issues will be resolved and an acceptable consensus will be reached in a couple days. Soon after we will pursue for needed approvals and funds for the renovation of our School Front building. Thanks. (MAP)
8.21.22: గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం: నిన్నటినుండి మన గ్రూప్ లో జరుగుతున్నచర్చ అందరికీ తెలిసిందే! ఈరోజు మన హైస్కూల్ అభివృద్ధి కోసం నాడు – నేడు పధకం ద్వారా మంజూరైన కోటి అరవై లక్షల రూపాయిల నిధుల విషయమై సేనాపతి కిషోర్ కుమార్ గారితో నేను మరియు డా,, మోహన్ రావు ఆచార్య గారు మాట్లాడడం జరిగింది. అయితే నిధులు వచ్చిన మాట వాస్తవమే అని, వాటిని ఏ విధంగా సరైన పద్దతిలో ఉపయోగించాలనే అంశంపై హై స్కూల్ యాజమాన్యం, చైర్మన్ మరియు స్థానిక నాయకులతో చర్చించిన తర్వాత హై స్కూల్ గ్రౌండ్ లో MEO ఆఫీస్ నకు ఇరువైపులా ఖాళీగా ఉన్నస్థలం, ప్రస్తుతమున్న జిమ్ రూమ్ నకు ఆనుకొని ఉన్న శిధిలమైన క్వార్టర్స్ ను కలుపుకొని నూతనంగా తరగతి గదులు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు, ఇదే విషయం రాష్ట్ర మంత్రి గారు అయిన శ్రీ. డా,, సీదిరి అప్పలరాజు గారికి తెలియజేసినట్టు చెప్పడం జరిగింది. మనమందరమూ చర్చించినట్టు తరగతి గదులు గ్రౌండ్ కు అతి సమీపంలో ఉండడం కారణంగా విద్యార్థులు క్రీడల నిమిత్తం, ఇతర శారీరక వ్యాయామం నిమిత్తం గ్రౌండ్ ను సక్రమంగా వినియోగించుకొనే అవకాశం వున్నది మరియు మందస పట్టణానికి చెందిన యువకులు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్ సదుపాయము కూడా ఉంటుంది కనుక ఇది మందస పట్టణానికి మేలు చేసే ప్రతిపాదన అని భావిస్థున్నాము. అదే విధంగా మందస హై స్కూల్ గ్రౌండ్ నకు చుట్టుప్రక్కలా ప్రహరీ నిర్మాణానికి గాను సుమారు యాభై లక్షల రూపాయిల నిధులు మంజూరైనట్లు కూడా కిషోర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ ప్రహరీ నిర్మాణం కూడా గ్రౌండ్ అభివృద్ధికి మేలు చేస్తుంది అని భావిస్తున్నాము.
8.20.22: Dear friends: మీరందరూ మన High School development గురించి చేస్తున్న discussion ప్రశంసనీయం. తప్పకుండా తొందర్లోనే ఆ విషయాలన్నింటికోసం (additional space for students and playground space) అన్నివిధాలా ప్రయత్నిద్దాం. అయితే ప్రస్తుతానికి ఈ Temporary Forum యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీ అందరికీ తెలిసినదే, అది Renovation of the main ancestral beautiful school building. అందువలన ఆ renovation కోసం అవసరమైన permissions మరియు Funds ఎలా లభిస్తాయో ముందు మనం చూడాలి. Simultaneously గా మిగతా proposals కూడా చేద్దాం. Your comments will be appreciated. (MAP)
🙏🙏 సర్. మీరు చెప్పినట్టు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త నిర్మాణాలు చేపట్టినప్పటికీ, మన పురాతన కట్టడాలను కాపాడుకొలేకపోతే ఒక ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతను కాపాడుకోలేము. అదేవిధంగా మందస పట్టణానికి ప్రత్యేకతగా నిలుస్తున్న పురాతన కట్టడాలయిన SRSMZP హై స్కూల్, రాజావారి కోట, రాణి గారి కోట, వాసుదేవ పెరుమాళ్ దేవాలయం, రాజుగారి కోనేరు మొదలగు కట్టడాలను రక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. (KH)
8.20.22: I am happy to see the enthusiastic participation of our dear members in this Forum. Thanks to Nageswararao garu, Prabhakar garu and Kishor garu for precisely explaining the status of the allocated funds, on-going construction of new buildings as well as the sheer negligence of the renovation of the main ancestral beautiful school building, which was a long due. As you are all aware, I reiterate the fact that even if we spend crores of rupees and construct several multi-storied buildings, it is needless to say that our school will not look our old school without the preservation of the main school building. This school building, like Raja’s palace, Queen’s palaces, Vasudeva temple, among others has an unparalleled architecture and nostalgic beauty which you witness hardly elsewhere. So dear friends, let us earnestly try to give the school building the original beauty it rightfully deserves. I have the complete confidence in our group members who have the invaluable potential to successfully accomplish our goal.
While sincerely appreciating the opinions expressed by Nageswararao garu, Hemanth garu, Prabhakar garu, Kishor garu and Dilip garu, I also request Chandrasekhar garu, Jayaprakash garu and Chitti garu to express their invaluable suggestions so that we can have a consensus on how we can proceed further. (Note: I apologize for not able to express my above views in Telugu. Hope you will not mind!) (MAP)
8.20.2022: గ్రౌండ్లో కట్టుకోవడానికి ఏ యూత్ అండ్ మందస పట్టణం చెందిన పెద్దలు అలాగే మాజీ క్రీడాకారులు ఎవరు కూడా అంగీకరించరు కారణం హైస్కూల్ అక్కడ ఉంటది బిల్డింగ్ గ్రౌండ్లో ఉంటుందా సార్ నాకు తెలిసి మన మందస పట్నంలో ఉన్న ఏకైక ఆటస్థలం దాన్ని మనం విడిచి పెట్టుకుంటే రేపు అందరూ అనారోగ్య పాలవుతారు (KS)
8.20.2022: సుమారుగా800మంది బాలబాలికలు చదువుతున్న రాజా వారి పాఠశాలలో తగు తరగతి గదులు, లేక చాలా అవస్త పడుతున్నారు అందరికీ విదితమే .నాబార్డ్ నిధులు మంత్రి వర్యులు మంజూరు చేసిన కాంట్రాక్టర్ సకాలములో పనులు చేయకపోవడం శోచనీయం. ప్రస్తుతం నాడు నేడు పనులలో భాగంగా పాఠశాల తరగతి గదులు నిర్మాణానికి 30శాతం నిధులు పాఠశాల అకౌంట్ లో ఉంది. 30, శాతం నిధులు వినియోగించి బిల్ల్స్ అప్డేట్ చేస్తోంటే నిధులు మంజూరు అవుతూ ఉంటాయి. అదనపు తరగతి గదులను నిర్మించటానికి స్థలాభావం ఉన్నదని వీటిని high school గ్రౌండ్ లో నిర్మించుకోడానికి మన యూత్ కి పెద్దలకు కమిటీకి hm గారు చెప్పడం, ఐటీడీయే D E గారు సైట్ విసిట్ చేయడం జరిగింది గానీ ఒక నిర్ణయానికి రాకపోవడం గమనార్హం .ఈ రోజు పలాస సమావేశంలో జరిగిన జిల్లా A P C గారు 23/8/22లోగా బిల్ల్స్ అప్డేట్ చేయండి లేకపోతే వసతి స్థలం లేదని నిధులు అర్జెంట్ గా పంప మని చెప్పడం జరిగినది. ఏది ఏమైనా సరే గౌరవ పెద్దలు ,విద్యాభిలసులు యువకులు తమ వంతు గా గౌరవ మంత్రి వర్యులు వారితో సంప్రదించి ముందడుగు వేయగలందులకు కోరుతూ (PP)
8.20.2022: మోనంగి నాగేశ్వరరావు గారు పాఠశాల అభివృద్ధి కోసం అనుసరించాల్సిన విధానం పై మంచి సూచనలు అందజేశారు.
అదేవిధంగా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు నాడు-నేడు పధకం క్రింద మన హై స్కూల్ కి అదనంగా 01 .60 కోట్ల రూపాయిల నిధులు మంజూరయ్యాయి కనుక ఆ నిధులతో నూతన భవనాలు నిర్మించుకోవచ్చు. ముందుగా మంజూరైన నిధుల(1.80 కోట్లు)లో ఉన్న డబ్బుతో హైస్కూల్ యొక్క ముందరి భాగాన్ని మరమ్మత్తులు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. (KM)
8.20.2022: డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. Dr. మోహన్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రూప్ మొదలు పెట్టారు. మన మందస SRSMZPH స్కూల్ లో ప్రస్తుతం 756 మంది పిల్లలు చదువుచున్నారు. అందుకు గాను 39 మంది టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వున్నారు. ప్రస్తుతం 18 మంచి రూంలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో నాబార్డ్ నిధులు 1,80,00,000 లక్షల రూపాయలు సాంక్షన్ అయ్యాయి. అందుకు గాను కాంట్రాక్టర్ జి+2 మొత్తం 6 రూమ్స్ కట్టేరు. ఇంకా 2 రూమ్స్ కట్టవలసి ఉంది. అయినప్పటికి అందులో అనగా 1,80,00,000 లలో చాలా డబ్బులు మిగిలి పోయావి. అందుకు గాను HM మరియు సిబ్బంది ఫ్రంట్ ఎలెవేషన్ మార్చమని రిక్వెస్ట్ చేశారు. అందుకు ఆ కాంట్రాక్టర్ పై పెంకులు చాలా దూరం నుండి తెప్పించాలని ఇబ్బంది అని తప్పించుకున్నాడు. మరియు సరి అయిన టైం లో బిల్లులు చెల్లించలేకపోవడం ఇతరత్రా కారణాలతో ఆయన వెళ్లిపోయారు అని తెలిసింది. మరల ప్రస్తుతం నాడు నేడు కింద 1,60,00,000 రూపాయలు సాంక్షన్ aiendi. మరికొన్ని రూమ్స్ కట్టాలని ఆలోచన లో వున్నారు. ఏది ఏమైనా మన పురాతనమైన హైస్కూలు అదే రూపంలో కట్టి పాత జ్ఞాపకాలను భద్రపరచుకోవాలనుకుంటే మన గౌరవ మినిస్టర్ గారిని మన పెద్దలు కలిసి, ముందుగా చర్చించుకుని దాని, దాన్ని మినిస్టర్ గారికి వివరిస్తే మంచి జరుగుతాదని నా నమ్మకం. ఇందుకు సమర్థులు కిషోర్ తమ్ముడు, BJP తమ్మూ, చంద్రశేఖర్ మామయ్య గారు,ప్రభాకర్ మేషార్, ఇతరత్రా అందరూ వున్నారు అని నా నమ్మకం. (MNR)
8.19.2022: ఈ గ్రూప్ ని మరలా మరొక ప్రత్యేక గ్రూప్ గానో లేదా సొసైటీ గానో భావించవద్దు. ఇది కేవలం తాత్కాలిక ప్రాతిపదికన 05 – 10 మంది సభ్యులతో ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఒక చిన్న ఫోరమ్ మాత్రమే. ఈ గ్రూప్ యొక్క ప్రధాన లక్ష్యం, మన పురాతన హై స్కూల్ బిల్డింగ్ ని మరలా దాని యధాతథ స్థితికి (పురాతన రూపానికి) తీసుకురావడానికి ప్రయత్నించడం. ఈ గ్రూప్ ద్వారా మనం మన హై స్కూల్ అభివృధ్ధికోసం మనయొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను చర్చించుకొని, మన హైస్కూల్ యాజమాన్యానికి మరియు ప్రభుత్వానికి (విద్యాశాఖ కు) మధ్య అనుసంధాన కర్తగా వుంటూ మన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తాము.
ఈ ఫోరం లో ప్రతి ఒక్క సభ్యుడూ తమ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా ఎటువంటి సంశయం లేకుండా వ్యక్తపరచవచ్చు. మనం చర్చించుకొనే అన్ని అంశాలు ఈ గ్రూప్ కి మాత్రమే పరిమితం మరియు వాటిని బహిర్గతం చేయము. (MAP)