8.18.2022: శ్రీ గంగాధర గరుడ గోవిందాలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు మందస పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ….. మన కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన ఆలయ మెట్ల మార్గం మరమ్మత్తులు కార్యక్రమం పూర్తయ్యిందన్న విషయము అందరికీ తెలిసినదే. మీ అందరి సహకారం, తోడ్పాటు లేకుంటే ఈ కార్యక్రమం ఇంత తొందరగా పూర్తయ్యేది కాదు.
అదే విధంగా కొండపైన దేవాలయమునకు ఆనుకొని ఉన్న పురాతన రాతి నిర్మితమైన మండపం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఉంది. కనుక మన కమిటీ ఆధ్వర్యంలో ఆ మండపానికి కూడా మరమ్మత్తులు చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. ఈ మండపానికి మరమ్మత్తులు పూర్తి చేసినట్లయిన, కొండపైన వివిధ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరియు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
కనుక అందరూ ఈ మరమ్మత్తు కార్యక్రమంలో భాగస్వాములై, తమకు తోచిన విధంగా (వస్తు రూపేణా లేదా నగదు రూపేణా) సహాయసహకారాలు అందించాలని కోరుతున్నాము. మీరు అందజేస్తున్న మరియు అందజేయబోయే సహాయములకు ఎటువంటి పరిమితులు లేవు. మీరు అందించిన ప్రతి చిన్న సహాయం కూడా ఈ బృహత్ కార్యక్రమానికి పెద్ద తోడ్పాటే అవుతుంది. మనలో ఎవరైనా ఏమైనా విరాళాలు (నిర్మాణ సామగ్రి రూపేణా) అందజేయాలనుకుంటే సేనాపతి కిషోర్ గారు (891 927 2300) లేదా చల్ల రామారావు గారు (900 033 1343) లేదా వడ్డి చంద్రశేఖర్ గారు (984 987 7932) లను సంప్రదించగలరు. నగదు రూపేణా విరాళాలు అందజేయదలచిన వారు కె. మాధవరావు గారికి (924 673 8122) ఫోన్ -పే లేదా గూగుల్ -పే ద్వారా అందజేయగలరు. ఇంతవరకు మండపం మరియు మందిరముల మరమ్మత్తు కోసం 37,238 రూపాయలు విరాళాల రూపంలో సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా మన GGG దేవాలయ అభివృద్ధి కొరకు సహాయసహకారాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మరమ్మత్తులు పూర్తి చేసిన పిదప ఈ దేవాలయం మందస పట్టణానికి సరికొత్త శోభను తీసుకువస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. Mohan Acharya
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మంచి ఆలోచన. కొండపైన గల ఈ మండపాన్ని పునర్నిర్మాణం గావించి అందుబాటులోకి తెచ్చినట్లు అయిన భక్తులకు మరియు యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు శివరాత్రి వంటి పండగల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది . Hemanth.K
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ మెట్లు కొరకు ఎంతో సహకరించి మూడు లక్షల రూపాయలు మెట్ల కొరకు విరాళం ఇచ్చిన శ్రీమాన్ డాక్టర్ మోహన్ రావు ఆచార్య గారు కి మందస గ్రామం తరపున మరియు గుడి అభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే అతను ఇచ్చిన మూడు లక్షలు కూడా ఎంతో పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా వివాదాలు లేకుండా మెట్లను పూర్తి చేయడం ఎంతో సంతోషకరం సహకరించిన ప్రజలకి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Kishor.S
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మన ఆనందగిరి మెట్టపైన వెలసిన దేవాలయం మెట్ల మరమ్మత్తు పనులు పూర్తవడం మరియు దేవాలయాన్ని సులభంగా చేరుకోవడానికి అవకాశం లభించడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా కంచుమై కాలనీ యువతకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వడ్డి చంద్రశేఖర్ గారు మరియు సేనాపతి కిషోర్ గార్లు ప్రత్యేకమైన శ్రద్ధ, బాధ్యత తీసుకోకుంటే ఈ నిర్మాణం/ మరమ్మత్తు పనులు సాధ్యమయ్యేవి కాదు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకనుండి భక్తులు సులభంగా దేవాలయాన్ని చేరుకొని దేవుణ్ణి దర్శించుకొని పూజలు నిర్వహించుకోవచ్చు అని అనుకుంటున్నాను. ముఖ్యంగా మహా శివరాత్రి వంటి పండగల సమయంలో దేవాలయానికి చేరుకోవడానికి భక్తులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని నా అభిప్రాయం. ధన్యవాదములతో, Mohan Acharya.
దేవాలయ మెట్ల నిర్మాణానికి గాను 03 లక్షల రూపాయిలను విరాళంగా అందజేసిన డా., మోహన్ ఆచార్య గార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేవాలయ మెట్ల మరమ్మత్తు/ నిర్మాణం పూర్తయింది అనే విషయం కూడా గ్రూప్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాము. ఇకనుండి భక్తులందరూ మెట్ల మార్గం గుండా సులభంగా దేవాలయాన్ని చేరుకొని, దేవుణ్ణి దర్శించుకునే అవకాశం లభించింది. కనుక భక్తులు ఇక సులభంగా దేవాలయాన్ని చేరుకొని దేవుణ్ణి దర్శించుకొని, నిత్యమూ పూజలు నిర్వహించుకోవచ్చు. Hemanth. K
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ప్రస్తుతం మన గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆనందగిరి మెట్ట పైన వెలసిన శ్రీ గంగాధర గరుడ గోవిందాలయ మెట్ల మరమ్మత్తులకు గాను మోహన్ ఆచార్య గారు రెండవ విడతగా లక్ష యాభై వేల రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. గ్రూప్ సభ్యుల తరుపున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మన ఆనందగిరి మెట్టపైన వెలసిన శ్రీ గంగాధర గరుడ గోవిందాలయ మెట్ల మరమ్మత్తు కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ రందరూ ఈ విధముగా ప్రత్యేకమైన శ్రద్ధ, బాధ్యత తీసుకోకుంటే ఈ నిర్మాణం / మరమ్మత్తు పనులు ఇంత తొందరగా సాధ్యమయ్యేవి కాదు. ఈ సందర్భంగా వారికి పేరుపేరున మరో సారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~