Manjusha News

Manjusha Weekly (Sunday: 09232022)

మందస పట్టణంలో కొలువు దీరిన కిల్లమ్మ తల్లి

         దసరా ఉత్సవాల సందర్భంగా మందస పట్టణ మరియు పరిసర ప్రాంతాల ఆరాధ్య దైవమైన కిల్లమ్మతల్లి మందస పట్టణంలోని రాజుగారి కోట ఆవరణలో కొలువుదీరింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా కిల్లమ్మ తల్లి పిడిమందస గ్రామం నుండి మందస వచ్చి, మందస పట్టణంలో  16 రోజులపాటు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తిరిగి పిడిమందస గ్రామానికి వెళ్ళిపోతుంది. కిల్లమ్మ తల్లి అమ్మవారు మందస పట్టణం నుండి తిరిగి వెళ్లిన తరువాతి రోజున మందస మరియు పరిసర ప్రాంతాల ప్రజలు దసరా ఉత్సవాలను జరుపుకుంటారు.

నాడు- నేడు పధకం క్రింద నూతన భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన

     ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పధకం క్రింద మంజూరు చేసిన సుమారు 01.60  కోట్ల రూపాయిల నిధులతో శ్రీ రాజా శ్రీనివాస మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నూతన భవన (అదనపు తరగతి గదుల ) నిర్మాణానికి సంబంధిత అధికారులు స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాంబమూర్తి మాస్టర్, పీడీ రవి కుమార్ మొహంతి, మందస పట్టణ వైసీపీ నాయకులు కిషోర్, గిన్ని తిరుపతి రెడ్డి, కంచి బెహరా ( ఎంపీటీసీ ), కిల్లమ్మశెట్టి  నరేష్, వడ్డి చంద్ర శేఖర్ మరియు మందస యువకులు, పెద్దలు పాల్గొనడం జరిగింది.

జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన మందస (ఆణి)ముత్యం సిద్ధూ

మందస పట్టణం, కంచుమై కాలనీ కి    చెందిన సిద్ధార్ధ మహరణా జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ అక్టోబర్ లో గుజరాత్ రాజధాని గాంధీ నగర్ లో జరగనున్నాయి.
    ఈ పోటీలలో పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు మందస పట్టణానికి చెందిన సిద్ధార్ధ మహరణ ఎంపికైనట్లు మందస ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు గారు, పీడీ రవికుమార్ మొహంతి గారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, పట్టణ పెద్దలు పెద్దఎత్తున సిద్ధార్ధ మహరణ కు అభినందనలు తెలపడం జరిగింది.    
Siddu et al
 సిద్ధార్ధ ను అభినందిస్తున్న జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు 
  వచ్చేవారం సంచిక నుండి మందస కు సంబంధించిన మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ  …………     ప్రచురణ కర్త:  హేమంత్

Leave a Comment

Your email address will not be published.