ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పధకం క్రింద మంజూరు చేసిన సుమారు 01.60 కోట్ల రూపాయిల నిధులతో శ్రీ రాజా శ్రీనివాస మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో నూతన భవన (అదనపు తరగతి గదుల ) నిర్మాణానికి సంబంధిత అధికారులు స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాంబమూర్తి మాస్టర్, పీడీ రవి కుమార్ మొహంతి, మందస పట్టణ వైసీపీ నాయకులు కిషోర్, గిన్ని తిరుపతి రెడ్డి, కంచి బెహరా ( ఎంపీటీసీ ), కిల్లమ్మశెట్టి నరేష్, వడ్డి చంద్ర శేఖర్ మరియు మందస యువకులు, పెద్దలు పాల్గొనడం జరిగింది.