Local News and Events
Free Buttermilk Summer Camp at Santha Market Junction, MANDASA by Sri Satya Sai Seva Samithi, MANDASA
మన మందస అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించబడిన మరుగుదొడ్లు సక్రమంగా వినియోగంచబడుతున్నాయి. దీనివల్ల చాలామంది ప్రజలు/ ప్రయాణికులు మందస పట్టణంలోని బస్టాండ్ లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంత మేర తొలగినట్లే భావించాలి. అయితే ఇక్కడ మరుగుదొడ్లు ఉన్న విషయం తెలియక చాలామంది ప్రజలు/ ప్రయాణీకులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మరుగుదొడ్లను సూచించే విధంగా ఏమైనా బ్యానర్స్/ ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసినట్లయితే మరింతమంది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ మరుగుదొడ్లకు నీటి సదుపాయం కల్పించి, తుదమెరుగులు దిద్దడంలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి గారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే విధంగా మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మందస పట్టణ మెయిన్ రోడ్ నిర్మాణం కూడా తుది అంకానికి చేరుకుంది మరియు అతి తొందరలోనే ఈ నిర్మాణం కూడా మందస పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, మందస పట్టణ అభివృద్ధికి ఒక మైలరాయిగా మిగులుతుందని ఆశిస్తున్నాము.
మందసా పేరు మరోసారి దేశమంతా తెలిసేటట్లు చేసిన సోదరుడు సతీష్ కుమార్ కి అభినందనలు…💐💐💐విషయాన్నీ ఇంత వివరంగా తెలియపర్చిన ఆనంద్ అన్న కి సెల్యూట్👏
Renovation of Gangadhara Garuda Govinda Temple
మందస పట్టణంలో హై స్కూల్ లో సుమారు 200 మంది విద్యార్థులకు పరీక్ష సమితి కీర్తిశేషులు సేనాపతి రాధాకృష్ణ మాస్టారు గారి ఆశీస్సులతో వారి కుమారుడు సేనాపతి కిషోర్ కుమార్ గారు పరీక్ష సామాగ్రి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. PMA: Happy to see the distribution of educational material to all the students of our high school by Kishor garu in memory of his father, late Senapathi Radhakrishna garu. Incidentally, I was in 10th class when he was in SSLC and used to be our SPL. He was a nice and decent individual. May his soul rest in eternal peace! I convey my best wishes to Kishor garu and best regards to all the participated teachers (especially those I can see and recognize in the posted photograph namely, Ramarao garu, Bhaskararao garu and Rajani garu) and good luck to all the students especially those with meritorious grades. Because they are the hopes and dreams of our nostalgic Mandasa! Hope to see many more such educational activities in our high school in near future.
చిన్నారి పాప ట్రీట్మెంట్ కోసం 20000 ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ